ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ/ బి.టెక్/ డిప్లొమా, ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 22.
ఖాళీలు: 133.
విభాగాల వారీగా ఖాళీలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్/ టెక్నాలజీ): సివిల్ 1, ఎలక్ట్రికల్ 2, ఎలక్ట్రానిక్స్ 6, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2, మెకానికల్/ ఆటోమొబైల్ 2, బీసీఏ9.
టెక్నికల్ డిప్లొమా అప్రెంటీస్ (డిప్లొమా): సివిల్ 15, ఎలక్ట్రికల్ 15, ఎలక్ట్రానిక్స్ 14, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 6, మెకానికల్/ ఆటోమొబైల్ 4, కంప్యూటర్ అప్లికేషన్/ కంప్యూటర్ అప్లికేషన్ & బిజినెస్ మేనేజ్మెంట్ 10.
ట్రేడ్ అప్రెంటీస్ (ఐటీఐ/ ట్రేడ్): కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (సీఓపీఏ) 39, స్టెనో 8.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ బోర్డు నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, డిప్లొమా, ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. 2022కు ముందు గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు కాదు.
వయోపరిమితి: 18 నుంచి 26 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 11.
లాస్ట్ డేట్: మార్చి 22.
సెలెక్షన్ ప్రాసెస్: క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.aai.aero ను సందర్శించండి.
