వచ్చే ఏడాది నుంచి వరంగల్ లో రంజీ మ్యాచ్ లు: హెచ్‌సీఏ అధ్యక్షుడు

వచ్చే ఏడాది నుంచి వరంగల్ లో రంజీ మ్యాచ్ లు: హెచ్‌సీఏ అధ్యక్షుడు

వచ్చే ఏడాది నుంచి వ‌రంగ‌ల్‌లోనూ రంజీ మ్యాచ్‌లు నిర్వహిస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శన‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు చెప్పారు.  హైదరాబాద్‌తోపాటు వరంగల్‌ జిల్లాలోనూ క్రికెట్‌ను అభివృద్ధి చేస్తానని అయన  తెలిపారు.  వరంగల్ లో కొత్త స్టేడియం నిర్మాణంపై అపెక్స్‌లో చ‌ర్చిస్తామన్నారు. 

చదువు, ఆటల పరంగా తాను వరంగల్ నుంచే స్ఫూర్తి పొందానని తెలిపారు. త్వరలోనే వరంగల్ క్రికెట్ క్లబ్ ఏర్పాటుచేస్తానని చెప్పారు. ప్రతి జిల్లాలో ఒక మంచి స్టేడియం కట్టేందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. గతంలో నిర్వహించిన టీటీఎల్ మాదిరిగా... త్వర‌లో రాష్ట్ర స్థాయి టీ20 టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు. ర్యాష్ట వ్యాప్తంగా 34 కేంద్రాల్లో స‌మ్మర్ క్యాంప్‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వహించామని చెప్పారు.