ఇది నిజమేనా: మా కులపోళ్లు.. మా మతం వాళ్ల కార్లకే ఇక్కడ పార్కింగ్

ఇది నిజమేనా: మా కులపోళ్లు.. మా మతం వాళ్ల కార్లకే ఇక్కడ పార్కింగ్

అది మాల్ అయినా, మార్కెట్ అయినా దేశంలో పార్కింగ్ సమస్యలు లేని చోటు లేదు. విచ్చలవిడిగా వాహనాల వినియోగం పెరగడమే అందుకు ప్రధాన కారణం. ఈ క్రమంలో పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టడానికి ఓ వర్గం వారు.. తమ కులపోళ్లకే ఇక్కడ పార్కింగ్ అంటూ ఓ బోర్డు పెట్టడం తీవ్ర వివాదస్పదమవుతోంది.

కోయంబత్తూరు రేస్ కోర్స్ వద్ద జైన్ కులస్తులకే ఇక్కడ పార్కింగ్ అంటూ ఓ బోర్డ్ పాతారు. అందుకు సంబంధించిన ఫోటోలను 'ఏజెంట్ పి' అనే యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెటిజెన్స్ జైనుల ప్రవర్తనను వ్యతిరేకిస్తున్నారు. "సాంకేతికంగా జైనులు కార్లను ఉపయోగించకూడదు. కార్లు శిలాజ ఇంధనాలతో నడుస్తాయి. ఆ ఇంధనం.. జీవులు, జంతువులు చనిపోయి కుళ్ళిపోయిన స్థితి నుండి సృష్టించబడుతుంది.." అంటూ ఓ నెటిజెన్ పెట్టిన కామెంట్ అందరిని ఆకర్షిస్తోంది.

మరో నెటిజెన్.. ఇది రేస్ కోర్స్‌లోని జైన్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ అని, బిల్డర్ పేరు కూడా జైన్ అని.. అందుకే ఈ ప్రకటన చేసిండొచ్చని వెల్లడించారు.