డిమాండ్లు పరిష్కరించాలె.. లేకపోతే డ్యూటీలు బహిష్కరిస్తం

డిమాండ్లు  పరిష్కరించాలె.. లేకపోతే డ్యూటీలు బహిష్కరిస్తం
  • డిమాండ్లు పరిష్కరించాలె
  • లేకపోతే ఈనెల 11 నుంచి  డ్యూటీలు బహిష్కరిస్తం
  • సర్కారుకు జూనియర్  డాక్టర్ల అల్టిమేటం
  • గాంధీ మెడికల్​ కాలేజీలో  నల్ల బ్యాడ్జీలతో నిరసన

పద్మారావు నగర్, వెలుగు : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే ఈనెల 11 నుంచి రాష్ర్టవ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగతా అన్ని రకాల వైద్య సేవలను బహిష్కరిస్తామని గాంధీ మెడికల్​ కాలేజీ జూనియర్  డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. సర్కారు తీరును నిరసిస్తూ శనివారం గాంధీ మెడికల్​ కాలేజీ ఎదుట వారు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. తమకు హైజీనిక్, సెక్యూరిటీతో కూడిన వసతిగృహాలను కేటాయించాలని, ఎన్ఎంసీ నోటిఫికేషన్, రాష్ట్ర ప్రభుత్వ గైడ్ లైన్స్​ ప్రకారం జిల్లాల్లో పనిచేసే పీజీ డాక్టర్లకు ఆహార సౌకర్యం కల్పించాలని డిమాండ్  చేశారు.  ఈ ఆందోళనలో గాంధీ జూనియర్  డాక్టర్ల ప్రెసిడెంట్​ డాక్టర్  కరిష్ని, రాష్ట్ర జూనియర్  డాక్టర్ల జనరల్​ సెక్రటరీ డాక్టర్  అఖిల్, వైస్​ ప్రెసిడెంట్​ డాక్టర్  కౌశిక్​ జోషి పాల్గొన్నారు.