బీజేపీతో దేశానికి అత్యంత ప్రమాదం..మళ్లీ గెలిస్తే ఫ్యూచర్ ఉండదు: భట్టి

బీజేపీతో దేశానికి అత్యంత ప్రమాదం..మళ్లీ గెలిస్తే ఫ్యూచర్ ఉండదు: భట్టి

బీజేపీతో దేశానికి అత్యంత  ప్రమాదమని..మళ్లీ గెలిస్తే దేశానికి భవిష్యత్ ఉండదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.  రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుంది.. ప్రజల హక్కులను తొక్కి పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ పవర్లోకి వస్తేనే రిజర్వేషన్ల కుట్ర ఆగుతోందన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.  ఉన్న వాస్తవాలు మాట్లాడితే  బీజేపీ నేతలు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. 

 రాజ్యంగం ఇచ్చిన రిజర్వేషన్లను ఎత్తేస్తారా? అని ప్రశ్నించారు భట్టి .  రిజర్వేషన్లు ఎత్తేసేందుకు 400 సీట్టు అడుగుతున్నారు.. ఈ ఎన్నికల్లో బీజేపీని బొంద పెట్టాల్సిందేనని చెప్పారు.   రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పెద్దలు అమలు చేస్తూ వచ్చారు.  కేంద్రంలో కాంగ్రెస్ పవర్లోకి రాగానే కులగణన చేస్తుందన్నారు.  ఫెడరల్ స్పూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

 మల్టీ పార్టీ సిస్టమ్ ఉన్నటువంటి దేశం భారత్ అని చెప్పారు. 10 సంవత్సరాల్లో దేశంలో  బీజేపీ అల్లకల్లోలం సృష్టించిందన్నారు.  కేసీఆర్ బీజేపీకి తొత్తుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కులగణన చేయొద్దని బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అమిత్ షా గురించి అవినీతిలో మునిగి తేలిన కేసీఆర్ గురించి మాట్లాడటానికి ఏం లేదన్నారు. భట్టి.