జయలలిత మృతిపై తమిళనాడు ప్రభుత్వానికి రిపోర్టు

జయలలిత మృతిపై తమిళనాడు ప్రభుత్వానికి రిపోర్టు

తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత మృతిపై రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుముఘస్వామి కమిషన్ రిపోర్టు సమర్పించింది. మొత్తం 590 పేజీలతో తయారైన నివేదికను తమిళనాడు సీఎం స్టాలిన్ కు అందజేశారు. జయలలిత చనిపోయిన ఐదేళ్ల తర్వాత ఆమె మృతిపై రిపోర్టును పూర్తి చేశారు. గతంలో ఉన్న అన్నా డీఎంకే ప్రభుత్వం జయలలిత మరణంపై జస్టిస్ అరుముఘస్వామి కమిషన్ ను ఏర్పాటు చేసింది. 

ఈ మేరకు 2017, నవంబర్ 22న ఆ కమిషన్ దర్యాప్తు ప్రారంభించింది. జయలలిత చనిపోయేందుకు గల కారణాలు రిపోర్టులో తెలిపింది. 2016 డిసెంబర్ 5న చెన్నై అపోలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ జయలలిత చనిపోయారు. అయితే విచారణలో భాగంగా సుమారు 2వందల మందిని కమిషన్ ప్రశ్నించింది.