సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ 49వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యూయూ లలిత్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. లలిత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 65ఏళ్ల వయస్సు వరకు కొనసాగుతారు. ఈయన పదవీ కాలం నవంబర్ వరకు మాత్రమే ఉండనుంది. అంటే లలిత్ 74 రోజులు మాత్రమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.

జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ 1957 నవంబరు 9వ తేదీన జన్మించారు. 1983 జూన్‌లో న్యాయవాద వృత్తిలోకి వచ్చిన లలిత్... 1985 డిసెంబరు వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. ఆ మరుసటి ఏడాది ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీసు షురూ చేశారు. 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అనేక కీలక కేసుల తీర్పుల్లోనూ జస్టిస్ లలిత్ భాగస్వామిగా ఉన్నారు.