కాళేశ్వరం బ్యారేజీలు టూరిస్టు స్పాట్లు

కాళేశ్వరం బ్యారేజీలు  టూరిస్టు స్పాట్లు

బోటింగ్​, అమ్యూజ్‌‌మెంట్ వాటర్ పార్కులు, గార్డెన్ల అభివృద్ధి

బడ్జెట్‌‌లో రూ.250 కోట్లు కేటాయించిన సర్కార్

టూరిజానికి ఎన్నడూ లేనంతగా ఈ సారి బడ్జెట్‌‌‌‌లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి మీద నిర్మించిన బ్యారేజీలను టూరిస్ట్ స్పాట్లుగా అభివృద్ధి చేసేందుకు రూ.250 కోట్లు కేటాయించింది. కాశ్మీర్‌‌‌‌లో దాల్ సరస్సులా ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్లను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్​ అధికారులను గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అధికారులు ప్రతిపాదనలు రెడీ చేయగా బడ్జెట్‌‌‌‌లో నిధులు కేటాయించారు. ఈ నిధులతో గోదావరి నదికి ఇరువైపులా దాల్ లేక్​లా ఆకర్షణీయంగా మొక్కలు పెంచనున్నారు. మేడిగడ్డ, కన్నెపల్లి, అన్నారం బ్యారేజీల వద్ద  బోటింగ్, బృందావన్‌‌‌‌ గార్డెన్‌‌‌‌లోలా ఫౌంటెయిన్‌‌‌‌, అమ్యూజ్‌‌‌‌మెంట్ వాటర్​ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం మేడిగడ్డ  బ్యారేజీ టూరిస్ట్ స్పాట్‌‌‌‌కు రూ.105 కోట్లు, కన్నెపల్లికి రూ.80 కోట్లు,  అన్నారం బ్యారేజీకి రూ.25 కోట్లు, అన్నారం కెనాల్​ టు కన్నెపల్లి టూరిజం పనులకు రూ.40 కోట్లు కేటాయించారు. ఈ ఫండ్స్‌‌‌‌తో అభివృద్ధి పనులు పూర్తయితే సాగునీటి ప్రాజెక్టులు కొత్త కళను సంతరించుకోనున్నాయి.