6 అదానీ కంపెనీలకు సెబీ నోటీసులు

6 అదానీ కంపెనీలకు సెబీ నోటీసులు
  • హిండెన్‌‌‌‌బర్గ్ ఆరోపణలపై చేస్తున్న దర్యాప్తుకు  కొనసాగింపుగానే

న్యూఢిల్లీ: లిస్టింగ్ రూల్స్‌‌‌‌ను ఉల్లంఘించినందుకు, రిలేటెడ్‌‌‌‌ పార్టీ ట్రాన్సాక్షన్లలో అవకతవకలు ఉన్నందుకు కనీసం ఆరు అదానీ గ్రూప్ కంపెనీలకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ (సెబీ) శుక్రవారం షోకాజ్ నోటీసులను ఇష్యూ చేసింది. ఈ లిస్టులో  గ్రూప్ ఫ్లాగ్‌‌‌‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌తో పాటు అదానీ పోర్ట్స్‌‌‌‌, అదానీ పవర్‌‌‌‌‌‌‌‌, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌‌‌‌, అదానీ టోటల్ గ్యాస్‌‌‌‌, అదానీ విల్మార్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. షోకాజ్ నోటీసులకు సంబంధించి ఈ కంపెనీలు తాజామార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌ రిజల్ట్స్‌‌‌‌ ప్రకటనలో పేర్కొన్నాయి. వీటి ప్రభావం పెద్దగా ఉండదని అదానీ గ్రూప్ పేర్కొంది. 

కానీ, అదానీ టోటల్‌‌‌‌ గ్యాస్‌‌‌‌, అదానీ విల్మార్ మినహా మిగిలిన కంపెనీల ఆడిటర్లు సెబీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్ ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌లో ఉండొచ్చనే సంకేతాలు ఇచ్చారు. తమకు ఎటువంటి సెబీ నోటీసులు రాలేదని ఏసీసీ, అంబుజా సిమెంట్స్ ప్రకటించాయి.  యూఎస్ షార్ట్ సెల్లర్‌‌‌‌‌‌‌‌ హిండెన్‌‌‌‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై సెబీ దర్యాప్తు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగానే సెబీ నోటీసులు ఇష్యూ చేసింది.  కాగా, షేర్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్స్ వంటి కార్పొరేట్ మోసాలకు అదానీ గ్రూప్ పాల్పడిందని కిందటేడాది జనవరిలో హిండెన్‌‌‌‌బర్గ్‌‌‌‌ ఓ రిపోర్ట్‌‌‌‌ను విడుదల చేసింది. 

ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేసినప్పటికీ, గ్రూప్ కంపెనీల షేర్లు 70 శాతం వరకు పడ్డాయి. అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ 150 బిలియన్ డాలర్లు తగ్గింది. చాలా కంపెనీల షేర్లు ప్రస్తుతం రికవర్ అయ్యాయి. ఈ ఇష్యూ సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. దర్యాప్తు జరపడానికి  ఓ ఎక్స్‌‌‌‌పర్ట్ కమిటీ కూడా ఏర్పాటయ్యింది. మరోవైపు  సెబీ దర్యాప్తు చేపడుతోంది. ఎటువంటి రెగ్యులేటరీ ఫెయిల్యూర్స్‌‌‌‌ లేవని సుప్రీం కోర్టు ఎక్స్‌‌‌‌పర్ట్ కమిటీ  కిందటేడాది మేలో ప్రకటించింది.సెబీ కూడా 24 అంశాల్లో 22 పై తన దర్యాప్తును  కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో ముగించింది.