తెలంగాణలో మండుతున్న ఎండలు .. 18 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్

తెలంగాణలో మండుతున్న ఎండలు .. 18 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్
  • రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు
  • సూర్యాపేట, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో 46.7 డిగ్రీలు నమోదు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. నిన్న మొన్నటి దాకా పది పదకొండు జిల్లాల్లోనే 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం ఏకంగా 18 జిల్లాల్లో ఆ స్థాయి టెంపరేచర్లు రికార్డయ్యాయి. 40కి పైగా మండలాల్లో 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మునగాల (సూర్యాపేట), పమ్మి (ఖమ్మం), నేరెళ్ల (జగిత్యాల)లలో 46.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 

మంథని (పెద్దపల్లి)లో 46.7, కామారెడ్డిగూడెం (నల్గొండ)లో 46.6, హాజీపూర్​ (మంచిర్యాల)లో 46.6, ముత్తారం (పెద్దపల్లి)లో 46.5, మామిళ్లగూడెం (సూర్యాపేట)లో 46.5, మట్టంపల్లి (సూర్యాపేట)లో 46.5, ఇబ్రహీంపేట (నల్గొండ)లో 46.5 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. 11 జిల్లాల్లో 45 నుంచి 45.9 మధ్య, 4 జిల్లాల్లో 44 నుంచి 44.9 డిగ్రీల మధ్యన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో వారం పాటు టెంపరేచర్లు ఇదే స్థాయిలో ఉంటాయని వీక్లీ బులెటిన్​లో ఐఎండీ హెచ్చరించింది. 

46 డిగ్రీలకు పైగా

కరీంనగర్ (వీణవంక) 46.5, మహబూబాబాద్ (కొమ్ములవంచ) 46.4, నారాయణపేట (ఊట్కూరు) 46.4, జయశంకర్​ భూపాలపల్లి (చేల్పూరు) 46.3, వరంగల్​ (గొర్రెకుంట) 46.3, ములుగు (మల్లూరు) 46.2, జనగామ (జాఫర్​గఢ్​) 46.1, వనపర్తి (కేతేపల్లి) 46.1, హనుమకొండ (కాజీపేట) 46, భద్రాద్రి కొత్తగూడెం (భద్రాచలం) 46, నాగర్​కర్నూల్ (కల్వకుర్తి) 46, జోగులాంబ గద్వాల (వడ్డేపల్లి) 46 డిగ్రీలు నమోదయ్యాయి.

45 డిగ్రీలకు పైగా రికార్డయిన జిల్లాలు

నిర్మల్ (ఖానాపూర్​) 45.8, మహబూబ్​నగర్ (జడ్చర్ల) 45.7, నిజామాబాద్ (నిజామాబాద్) 45.7, మేడ్చల్ మల్కాజ్​గిరి (కీసర) 45.7, కుమ్రంభీం ఆసిఫాబాద్ (ఎల్కపల్లి) 45.5, యాదాద్రి భువనగిరి (వలిగొండ) 45.5, సిద్దిపేట (లకుడారం) 45.5, కామారెడ్డి (రామారెడ్డి) 45.4, వికారాబాద్ (బంట్వారం) 45.4, రాజన్నసిరిసిల్ల (ఇల్లంతకుంట) 45.3, రంగారెడ్డి (మొయినాబాద్) 45.2 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యాయి.