అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం 39 శాతం డౌన్​

అదానీ గ్రీన్ ఎనర్జీ  లాభం 39 శాతం డౌన్​

న్యూఢిల్లీ: అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మార్చి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 38.85 శాతం క్షీణించి రూ. 310 కోట్లకు చేరుకుంది. పెరిగిన ఖర్చులే ఇందుకు కారణమని తెలిపింది.  మునుపటి 2022–-23 జనవరి-–మార్చి కాలంలో తమ నికర లాభం రూ. 507 కోట్లు అని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌‌‌‌లో తెలిపింది. 

2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం ఏడాది క్రితం రూ.2,977 కోట్ల నుంచి రూ.2,806 కోట్లకు పడిపోయింది. సమీక్షా కాలంలో కంపెనీ ఖర్చులు రూ.2,379 కోట్లకు పెరిగాయి. అంతకుముందు ఏడాది కాలంలో రూ.2,053 కోట్లుగా ఉన్నాయి.