చిరంజీవి సలహా పై కమల్ రియాక్షన్

చిరంజీవి సలహా పై కమల్ రియాక్షన్

తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమలహాసన్ లకు మెగాస్టార్ చిరంజీవి కీలక సలహాలు ఇచ్చారు. ప్రస్తుత రాజకీయాలు కులం, ధనం ప్రాతిపదికగా నడుస్తున్నాయని… ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లి సమయాన్ని వృథా చేసుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు.

చిరంజీవి సలహాపై స్పందిన కమలహాసన్..గెలుపు, ఓటముల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. మార్పు కోసం, ప్రజల్లో చైతన్యం కోసం రాజకీయరంగంలోకి ఎంటరైనట్లు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో ప్రజల ఆలోచన ధోరణిపై అవగాహన పెరిగిందని చెప్పారు కమల్.