డబుల్ బెడ్రూమ్ ఇచ్చేదాకా అంత్యక్రియలు చేయం

డబుల్ బెడ్రూమ్ ఇచ్చేదాకా అంత్యక్రియలు చేయం

డబుల్ బెడ్రూమ్ ఇచ్చేదాకా అంతక్రియలు చేయమన్నారు కందికొండ యాదగిరి సతీమణి. చిత్రపురి కాలనీలో సింగిల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వలేదన్నారు. కేటీఆర్ చెప్పినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదన్నారు. కంది కొండ మృతదేహాన్ని చిత్రపురి కాలనీ ఆఫీసుకి తీసుకెళ్తామన్నారు. సినీ ప్రముఖులంతా అక్కడికే రావాలన్నారు. 

 కందికొండ  భౌతికకాయాన్ని మోతీ నగర్ నుంచి.. ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. అభిమానుల  సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఫిల్మ్ చాంబర్ లో ఉంచారు. అయితే ఫిల్మ్ ఛాంబర్ లో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు కందికొండ అభిమానులు.  ఆ తర్వాత మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అనారోగ్యంతో నిన్న కందికొండ కన్నుమూశారు. రెండేళ్ల పాటు క్యాన్సర్ తో బాధపడ్డారు.  కీమో కారణంగా స్పైనల్ కార్డ్ దెబ్బతింది. సర్జరీ చేసినా ఆరోగ్యం మెరుగవ్వలేదు. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.