10th పాసైతే చాలు.. . సర్కారీ కొలువు రెడీ.. జీతం ఎంతంటే...

10th పాసైతే చాలు.. . సర్కారీ కొలువు  రెడీ.. జీతం ఎంతంటే...

పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా లేవని బాధ పడుతున్నారా? మీరు టెన్త్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.ఈ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణులైతే చాలు. ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి.

 పది పాసైతే చాలు ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అవకాశం వచ్చింది. ఈ సువర్ణావకాశాన్ని వదులుకోకండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 23,500 వరకు జీతం అందుకోవచ్చు.

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. కార్ డ్రైవర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 4 స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు జూన్ 05 వరకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా లేవని బాధ పడుతున్నారా? మీరు టెన్త్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.ఈ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణులైతే చాలు. ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి.ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ 20,000 నుంచి 23,500 అందిస్తారు.

మొత్తం స్టాఫ్ డ్రైవర్ పోస్టులు: 04
అర్హత: అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాసై ఉండాలి. దీంతో పాటు డ్రైవింగ్ లో 10 ఏళ్లు అనుభవం ఉండాలి. లైసెన్స్ కలిగి ఉండాలి.
వయో పరిమితి:అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 45 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడబ్య్లూఎస్/ఓబీసీ/ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అధికారిక వెబ్ సైట్ నుంచి ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను అవసరమైన పత్రాలతో పాటు క్రింది చిరునామాకు పంపాలి.

సీనియర్ మేనేజర్ (కార్పొరేట్ రిక్రూట్‌మెంట్)
రిక్రూట్‌మెంట్ సెల్,BEML భవనం
నం.23/1, 4వ ప్రధాన రహదారి
S.R నగర్, బెంగళూరు-560027