అదృష్టం అంటే ఇదే : కందిపప్పు కోసం వెళితే.. రూ.4 కోట్ల లాటరీ తగిలింది

అదృష్టం అంటే ఇదే : కందిపప్పు కోసం వెళితే.. రూ.4 కోట్ల లాటరీ తగిలింది

రాత్రికి రాత్రే కోటీశ్వరులం కావాలని ఎంతో మంది కలలు కంటారు. దీని కోసం లాటరీ టికెట్లు కొంటారు.  కానీ ఆ అదృష్టం అందరినీ వరించదు.. కొంతమందికే ధనలక్ష్మి తలుపు తడుతుంది. వారి జీవితాలనే మార్చేస్తుంది. ఇలాంటి ఘటనే అమెరికాలో ఓ వ్యక్తికి జరిగింది. ట్రక్కు డ్రైవర్ కు 4 కోట్ల ల్యాటరీ తగలడంతో రాత్రికి రాత్రే అతని జీవితం మారిపోయింది. 

అమెరికాలోని వర్జీనియాకు చెందిన ట్రక్ డ్రైవర్‌కు అదృష్టం మారింది. సౌత్ బోస్టన్ - వర్జీనియాకు చెందిన రస్సేల్ అనే వ్యక్తి  కందిపప్పు కొనడానికి  ఒక కిరాణా షాప్ కు వెళ్లాడు. ఇంట్లోకి కావాల్సిన సామాగ్రిని కొనుగోలు చేసిన తర్వాత  అక్కడ స్క్రాచ్ ఆఫ్ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. దానిని షాపింగ్ పూర్తయిన తర్వాత స్క్రాచ్ చేయాలనుకున్నాడు.  షాపింగ్ అయిపోయిన తర్వాత పార్కింగ్ దగ్గరకు వెళ్లిన రస్సేల్ టికెట్ ను స్క్రాచ్ చేశాడు. ల్యాటరీలో రూ.4 కోట్లు రావడంతో అతను ఒక్కసారిగా షాకయ్యాడు.  

తాను ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు గెలుచుకోలేదని..  ఇది తనకు గొప్ప అనుభూతి అని రస్సెల్ చెప్పాడు. ల్యాటరీ డబ్బులతో  ముందుగా హాలిడే ట్రిప్స్ కు వెళ్లి.. తర్వాత ఇతర ఖర్చులకు ప్లాన్ చేస్తానని తెలిపాడు.