నాపై విరుచుకుపడాలని ఆప్ హైకమాండ్ నుంచి నేతలకు ఒత్తిడి తెస్తుర్రు

నాపై విరుచుకుపడాలని ఆప్ హైకమాండ్ నుంచి నేతలకు ఒత్తిడి తెస్తుర్రు

తనను దారుణంగా తిట్టాలని ఆప్ నేతలపై పార్టీ హైకమాండ్ తీవ్ర ఒత్తిడి తెస్తుందని ఎంపీ స్వాతి మలివాల్ అన్నారు. మే 21 2024న తనకు పార్టీ సీనియర్ నాయకుడి నుండి కాల్ వచ్చిందని అతను తనకు ప్రతి ఒక్కరిపై ఎంత ఒత్తిడి ఉందో చెప్పారని అన్నారు. స్వాతిపై హీనంగా మాట్లాడాలని, ఆమె వ్యక్తిగత ఫోటోలను లీక్ చేసి విరుచుకుపడాలని పార్టీ పెద్దలు వారిపై ఒత్తిడి తెస్తున్నట్టు ఫోన్ లో చెప్పినట్టు తెలిపారు.

తనకు ఎవరు మద్దతిస్తే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తారని హెచ్చరికలు జారీ చేశారని మలివాల్ తెలిపారు. అమెరికాలో కూర్చున్న వాలంటీర్లను పిలిపించి తనపై విరుచుకుపడాలని చెబుతన్నారని మీరు వేల మంది సైన్యాన్ని పెంచుకోవచ్చని కానీ తాను ఒంటరిగా అన్నింటిని ఎదుర్కొంటానని చెప్పారు. ఎందుకంటే నిజం తన వైపు ఉందని తెలిపారు. తాను ఎవరి నుంచి కూడా ఏమీ ఆశించనని అన్నారు.

ఢిల్లీ మహిళా మంత్రి చిరునవ్వుతో పార్టీలోని తోటి నాయకులకును కించపరుస్తున్నందుకు బాధగా ఉందని చెప్పారు. తన ఆత్మగౌరవం కోసం తాను పోరాటం ప్రారంభించానని పోరాడుతూనే ఉంటానని తనకు న్యాయం జరిగే వరకు తాను ఈ పోరాటంలో పూర్తిగా ఒంటరిగా ఉంటానని చెప్పారు మలివాల్.