ఇరాన్ లో కొనసాగుతున్న నిరసనలు..2వేల మంది మృతి

ఇరాన్ లో కొనసాగుతున్న నిరసనలు..2వేల మంది మృతి

అల్లర్లతో ఇరాన్ అట్టుడుకుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. భద్రతాదళాల కాల్పుల్లో 2వేల మంది నిరసనకారులు చనిపోయారు. వేలాది మందిని అరెస్ట్ చేశారు. నిరసరకారుల్లో ఒకరిని ఉరితీస్తామని ప్రకటించింది. 

నిరసనకారులను అడ్డుకునేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 2వేల మంది  నిరసనకారులు చనిపోయారు. వేలాది మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ప్రజలకు ఇంటర్నెట్ సేవలను అందించే ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్, సెల్‌ఫోన్ టవర్లను బ్లాక్ చేశారు.ఇంటర్నెట్ షట్‌డౌన్ నుండి తప్పించుకోవడానికి ఇరానియన్లు  ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఇప్పటికీ దేశంలో వినియోగిస్తున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. 

నిరసనలు ఉధృతం అవుతున్న క్రమంలో ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ప్రకటించారు. ఈ చర్య ఇరాన్ పై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. అయితే నిరసనకారులపై అణచివేతను ఖండించిన ట్రంప్..దాడి చేస్తామని హెచ్చరించినా బెదిరేది లేదని, గతంలో జరిగిన దాడులను ఎలా ఎదుర్కొన్నామో అంతకంటే రెట్టింపు శక్తితో సిద్దంగా ఉన్నామని ఆదేశ విదేశాంగ మంత్రి ప్రకటించారు. 

అమెరికా ప్రతిస్పందన ..ఇరాన్ హెచ్చరిక..

ఇదిలా ఉంటే.. ఇరాన్ పై అమెరికా సైనిక చర్యకు సిద్దమవుతోంది..ఆందోళనకారులపై అణచివేత కొనసాగితే సైనికచర్య తప్పదని హెచ్చరించిన ట్రంప్ జాతీయ భద్రతాదళాలతో సమావేశమయ్యారు. నేడో రేపో ఇరాన్ పై దాడికి దిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇరాన్ కూడా అమెరికా సైనిక చర్యను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించింది. 2025 జూన్ లో అమెరికా దాడులను  ఎదుర్కొన్న దాని కంటే మరింత శక్తితో సిద్దంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్ఛీ చెప్పడంతో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.