భారత అంతరిక్ష్ పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన PSLV C 62 మిషన్ ప్రయోగం విఫలమైన విషయం తెలిసిందే. అయితే ఈ రాకెట్ లో అంతరిక్షానికి పంపించిన ఓ ఉపగ్రహం ఇప్పుడు యాక్టివ్ గా ఉంది. భూమి చుట్టూ తిరుగుతూ డేటాను విజయవంతంగా పంపుతోంది. ఇది ఊహించని అద్భుతం.రాకెట్ మూడో దశలో సమస్య వచ్చి కక్ష్యకు చేరలేదు. అయితే శాటిలైట్ పనిచేయడం గమనార్హం.
స్పానిష్ స్టార్టప్ ఆర్టిట్ పారాడగ్మ్ రూపొందించిన కెస్ట్రెల్ ఇనిషియల్ డామోన్ స్టేటర్ (KID) క్యాప్సూల్ శాటిలైట్ పనిచేస్తుందని ఆ సంస్థ ట్వీట్ చేసింది. జనవరి 12న PSLV -C62 రాకెట్ ద్వారా పదహారు ఉపగ్రహాలతో పాటు 25 కిలోలల ఫుట్ బాల్ పరిమాణంలో ఉన్న KID శాటిలైట్ ను కూడా పంపించారు. అయితే ఈ మిషన్ మూడో దశలో విఫలమైంది. ప్రయోగ కేంద్రంనుంచి సంబంధాలు తెగిపోవడంతో మిషన్ విఫలమైందన శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే కొద్ది నిమిషాలకే KID ఉపగ్రహం సిగ్నల్ పంపించిందని, నింగినుంచి డేటాను షేర్ చేస్తుందని పారాడగ్మ్ తెలిపింది.
2026 జనవరి 12న శ్రీహరికోట నుంచి PSLV-C62 రాకెట్ ను ప్రయోగించారు. ఇది EOS-N1తో పాటు ఇతర చిన్న శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.మొదటి రెండు దశలు సవ్యంగా సాగినా, మూడో దశలో ఇంజిన్ ప్రెజర్ డ్రాప్ అవ్వడంతో రాకెట్ నియంత్రణ కోల్పోయింది.ఫలితంగా 16 శాటిలైట్లు కక్ష్యలో చేరలేకపోయాయి. వీటిలో DRDOకు చెందిన EOS-N1 కూడా ఉంది. ఇవి వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోతాయి.
అయితే రాకెట్ విఫలమైనా..స్పానిష్ శాటిలైట్ KID మాత్రం పనిచేస్తూ డేటాను పంపుతోంది. ఇది ISROకు కొంత సానుకూలమైన విషయం.ఇది PSLV విశ్వసనీయతపై సందేహాలు రేకెత్తించినప్పటికీ ఈ చిన్న అద్భుతం ISROకు కొంత సాంకేతిక సమాచారాన్ని అందించగలదని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.
