షార్ట్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారా? మీ మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా..

షార్ట్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారా? మీ మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా..

మనం ఖాళీ సమయం దొరికితే చాలు ఫోన్ తీసి TikTok, Instagram Reels లేదా YouTube Shorts చూస్తూ గంటలు గంటలు గడిపేస్తుంటాం. అయితే, ఇలాంటి షార్ట్ వీడియోలు ఎక్కువగా చూడటం వల్ల మన మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతుందో చైనా పరిశోధకులు ఒక కొత్త అధ్యయనంలో వెల్లడించారు.

మెదడుపై పరిశోధన:
పరిశోధకులు కొంతమంది యువకుల మెదడు తరంగాలను (EEG) పరిశీలించి కొన్ని విషయాలను గుర్తించారు. షార్ట్ వీడియోలు చూడటం  అలవాటు పడిన వారి మెదడులో దృష్టిని కేంద్రీకరించే భాగాలు నెమ్మదిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఏదైనా పని మీద దృష్టి పెట్టి చేయాలన్నా లేదా దృష్టిని మళ్ళీ పని మీదకు మళ్ళించాలన్నా మెదడు చాలా ఇబ్బంది పడుతోంది. వీడియోలు చూస్తూ ఆపలేకపోవడం వల్ల మెదడులో సెల్ఫ్ కంట్రోల్ శక్తి తగ్గుతోంది. పరిశోధన ప్రకారం ఇవన్ని పూర్తిగా ప్రమాదం అని చెప్పలేం. కానీ షార్ట్ వీడియోలు చూడటం వల్లే ఫోకస్ తగ్గిందా ? లేక ఫోకస్ తక్కువగా ఉన్నవారే ఇలాంటి వీడియోలకు ఆకర్షితులవుతున్నారా ? అనేది ఇంకా పూర్తిస్థాయిలో తేలాల్సి ఉంది. అయితే, గంటల తరబడి ఎం  ఆలోచించకుండా వీడియోలు స్క్రోల్ చేయడం వల్ల మెదడు త్వరగా అలసిపోతుంది.

 ఫోకస్ పెరగాలంటే ఏం చేయాలి?: 
మనం సోషల్ మీడియాను పూర్తిగా మానేయక్కర్లేదు, కానీ కొన్ని మార్పులు చేసుకుంటే మంచిది.  రోజుకు ఎంతసేపు వీడియోలు చూడాలి అనేదానికి ఒక టైం పెట్టుకోండి. భోజనం చేసేటప్పుడు లేదా నిద్రపోయే ముందు కనీసం ఒక గంట పాటు ఫోన్‌  దూరంగా పెట్టేయండి. ఏదైనా ముఖ్యమైన పని లేదా చదువు మొదలుపెట్టే ముందు షార్ట్ వీడియోలను చూడకండి. అలా చూస్తే పని మీద మనసు పెట్టడం కష్టమవుతుంది. కేవలం టైమ్ పాస్ కోసం కాకుండా, మీకు ఉపయోగపడే విషయాల కోసం మాత్రమే సోషల్ మీడియాను వాడటానికి ప్రయత్నించండి.