సోమాజీగూడ లోని బార్‌‌ లో రివాల్వర్‌‌తో బీభత్సం..నిందితుడి అరెస్ట్

సోమాజీగూడ లోని బార్‌‌ లో రివాల్వర్‌‌తో బీభత్సం..నిందితుడి అరెస్ట్

పంజాగుట్ట, వెలుగు: హైదరాబాద్​ సోమాజీగూడలోని హెడ్ క్వార్టర్స్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో మద్యం మత్తులో ఓ యువకుడు రివాల్వర్‌‌తో బీభత్సం సృష్టించాడు. ఒవైసీ కాలనీకి చెందిన మహ్మద్ షానవాజ్ శుక్రవారం రాత్రి బార్‌‌లో మద్యం తాగుతుండగా తోటి వినియోగదారులతో వివాదం తలెత్తింది. కోపోద్రిక్తుడైన షానవాజ్.. పార్కింగ్‌‌లోని తన మహీంద్రా థార్ వాహనం నుంచి రివాల్వర్ తెచ్చి కాల్పులకు యత్నించాడు. 

అప్రమత్తమైన బౌన్సర్లు గణేశ్, బచ్చు బంటి అతన్ని అడ్డుకున్నారు. అయితే, తాను గతంలో చెల్లించిన బిల్లు తిరిగి ఇవ్వాలని, లేదంటే కాల్పులు జరుపుతానని సిబ్బందిని అతడు బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన వినియోగదారులు అక్కడినుంచి పారిపోయారు. బౌన్సర్‌‌ బంటి అర్ధరాత్రి ఇచ్చిన ఫిర్యాదుతో పంజాగుట్ట ఇన్‌‌స్పెక్టర్ జహంగీర్ యాదవ్ బార్‌‌కు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రివాల్వర్, కారును స్వాధీనం చేసుకున్నారు. షానవాజ్​ను అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించినట్లు పేర్కొన్నారు.