‘దండోరా’ డైరెక్టర్, నితిన్ హీరో.. ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ‘రుక్కు రుక్కు రుక్మిణి’ సాంగ్

‘దండోరా’ డైరెక్టర్, నితిన్ హీరో.. ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ‘రుక్కు రుక్కు రుక్మిణి’ సాంగ్

నితిన్ హీరోగా ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అలియాస్ రుక్మిణి’.  హీరో నాని సమర్పణలో యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్‌‌‌‌కు జంటగా ఆఫియా సయ్యద్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌‌‌‌, ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు.

‘రుక్కు రుక్కు రుక్మిణి’ అంటూ సాగే మొదటి పాటను అక్టోబర్ 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ అనౌన్స్‌‌‌‌మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది.  ఫార్మల్ డ్రెస్‌‌‌‌లో నితిన్ కూల్ అండ్ స్టైలిష్‌‌‌‌గా కనిపిస్తే,  సంప్రదాయ చీరకట్టులో ఆఫియా సయ్యద్ అందంగా ఆకట్టుకుంటోంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న  ఈ చిత్రం  డిసెంబర్ 4న విడుదల కానుంది.