సంక్రాంతి పండగ వేళ గ్రామ పంచాయతీలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

సంక్రాంతి పండగ వేళ గ్రామ పంచాయతీలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

హైదరాబాద్: సంక్రాంతి పండగ వేళ గ్రామ పంచాతీయలకు తెలంగాణ సర్కార్ తీపి  కబురు అందించింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులు విడుదల చేసింది. డిప్యూటీ సీఎం, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు మంగళవారం (జనవరి 13) ఆర్ధిక శాఖ ఫండ్స్ రిలీజ్ చేసింది. నిధులను గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఉపయోగించాలని ప్రభుత్వం సూచించింది. 

ఈ సందర్భంగా గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్  మెంబర్లకు భట్టి విక్రమార్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, 2025, డిసెంబర్ నెలలో మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర తర్వాత 2025, డిసెంబర్ 22న గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు ఏర్పడ్డాయి. ఎన్నికల సమయంలోనే గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతి పండగ సందర్భంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.