Upasana Konidela : ఇది మామయ్య మెగా సంక్రాంతి.. 'మన శంకర వరప్రసాద్ గారు' సక్సెస్‌పై ఉపాసన స్పెషల్ విషెస్!

Upasana Konidela : ఇది మామయ్య మెగా సంక్రాంతి.. 'మన శంకర వరప్రసాద్ గారు' సక్సెస్‌పై ఉపాసన స్పెషల్ విషెస్!

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన అసలు సిసలు వివ్వరూపాన్ని చూపిస్తున్నారు. సంక్రాంతి కానుకుగా జనవరి 12న విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ  థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. మూడేళ్ల తర్వాత చిరంజీవి వెండితెరపై కన్పించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. వింటేజ్ లుక్ లో మెగాస్టార్ ని చూస్తున్నామంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 

ఉపాసన స్పెషల్ విష్

ఈ ‘మన శంకర వరప్రసాద్ గారు’  సినిమా ఘనవిజయం సాధించడంతో మెగా కుటుంబంలో సంక్రాంతి సంబరాలు ముందే వచ్చాయి. చిరంజీవి కోడలు ఉపాసన కొణిదెల తన మామగారి విజయాన్ని సోషల్ మీడియా వేదికగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎక్స్ వేదికగా సినిమాకు సంబంధించిన ఒక గ్లింప్స్‌ను షేర్ చేస్తూ.. “ఇది మెగా సంక్రాంతి. హార్టీ కంగ్రాచులేషన్స్ మామయ్యా!” అంటూ ప్రేమతో కూడిన సందేశాన్ని రాసుకొచ్చారు. మెగాస్టార్ బిగ్గెస్ట్ చీర్ లీడర్‌గా ఉపాసన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

బాక్సాఫీస్ వద్ద ‘బాస్’ హవా

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తొలి రోజే ఓపెనింగ్స్ అదరగొట్టింది.  ప్రీమియర్స్, తొలి రోజు కలిపి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.84 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చిరంజీవి కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. వరుస సంక్రాంతి సెలవులు రావడంతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డు సృష్టించబోతోందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కథ

ఈ సినిమా కథ ఒక సెక్యూరిటీ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. తన నుండి విడిపోయిన భార్య, పిల్లలను ఒక పగతో రగిలిపోయే మాజీ పోలీసు అధికారి నుండి కాపాడడమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. చిరంజీవి తనదైన కామెడీ టైమింగ్, హ్యూమర్, మాస్ యాక్షన్‌తో సినిమాను ఒంటిచేత్తో నడిపించారు. చిరంజీవి భార్యగా తన నటనతో సినిమాకు హుందాతనాన్ని తెచ్చారు. ఇక ఈ సినిమాలో వెంకీ మామ గెస్ట్ అప్పీరెన్స్ ప్రేక్షకులకు అసలైన ఐ-ఫీస్ట్. చిరు, వెంకీ స్క్రీన్ షేర్ చేసుకోవడం థియేటర్లలో విజిల్స్ వేయిస్తోంది. దర్శకుడిగా అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైన్‌మెంట్, కామెడీ పర్ఫెక్ట్‌గా వర్కవుట్ అయ్యాయని ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

'ది బాస్ ఈజ్ బ్యాక్'

సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అనవసరమైన సెటప్ లేకుండా డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వెళ్లడం, చిరంజీవి కామెడీ టైమింగ్ ఎక్కడా తగ్గకపోవడం సినిమాకు ప్లస్ పాయింట్స్ అని నెటిజన్లు పేర్కొంటున్నారు. మరికొందరు దీనిని చిరంజీవి గ్రేట్ కమ్ బ్యాక్ అని అభివర్ణిస్తున్నారు. దాదాపు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ప్రభాస్ 'రాజాసాబ్'తో పోటీ ఉన్నప్పటికీ, ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతుతో ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిలకడగా వసూళ్లను సాధిస్తోంది. పండగ సెలవులు ఇంకా ఉండటంతో ఈ సినిమా లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.