తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ సందర్భంగా రిజర్వు బ్యాంక్ జనవరి 14, 2026 నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు సెలవు ప్రకటించింది. భోగి పండుగతో ప్రారంభమయ్యే ఈ వేడుకల దృష్ట్యా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ప్రకారం బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి. కేవలం ప్రధాన కార్యాలయాలే కాకుండా అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని బ్యాంక్ బ్రాంచ్‌లు ఈ రోజు పనిచేయవని కస్టమర్లు గుర్తించాలి.
బ్యాంకు శాఖలు మూసివేసినప్పటికీ.. అకౌంట్ హోల్డర్లకు చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా మీరు ఎప్పుడైనా నగదు బదిలీ చేసుకోవచ్చు. అలాగే యూపీఐ ఆధారిత యాప్‌లైన గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా చేసే డిజిటల్ చెల్లింపులకు ఎలాంటి అంతరాయం ఉండదు.
►ALSO READ | పొరపాటున రాంగ్ UPIకి డబ్బు పంపారా? కంగారు పడకండి.. ఇలా వెనక్కి తెచ్చుకోండి
అలాగే డబ్బు అవసరాల కోసం ఏటీఎం కేంద్రాలు 24 గంటలూ అందుబాటులోనే ఉంటాయి. పండుగ రద్దీ దృష్ట్యా ఏటీఎంలలో నగదు కొరత రాకుండా బ్యాంకులు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నాయి. అయితే చెక్కుల క్లియరెన్స్ వంటి పనులకు సెలవు రోజున అవకాశం ఉండదు కాబట్టి.. అత్యవసర ఆర్థిక లావాదేవీలు ఉన్నవారు NEFT లేదా IMPS సేవలను ఉపయోగించుకోవడం బెస్ట్. బ్యాంకులకు సంబంధించిన ఏదైనా అత్యవసర సహాయం కోసం ఆయా బ్యాంకుల కస్టమర్ కేర్ నంబర్లను సంప్రదించవచ్చు కస్టమర్లు. ఏదైనా లోన్ రిలేటెడ్ అత్యవసరమైన పనులు ఉంటే సెలను రోజు కాకుండా మరో రోజు బ్యాంకును సంప్రదించటం బెటర్.
