అమితాబ్ తర్వాత నేనే సూపర్ స్టార్

అమితాబ్ తర్వాత నేనే సూపర్ స్టార్

ముంబై: బాలీవుడ్ ఫైర్‌‌బ్రాండ్ కంగనా రనౌత్ గురించి తెలిసిందే. ఈ హిందీ క్వీన్ ఎంత మంచి నటో అంతే ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తుంటుంది. క్వీన్, మణికర్ణిక సినిమాలతో నటిగా క్రేజ్ తెచ్చుకున్న కంగన.. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌‌‌‌తో పలుమార్లు తనను తాను పోల్చుకుంది. రీసెంట్‌‌గా మరోమారు అమితాబ్ తర్వాత ఈతరం సూపర్ స్టార్ తానేనని చెప్పింది.

మరో హీరోయిన్ తాప్సీ అంటే కంగనాకు గిట్టని విషయం విదితమే. పలుమార్లు ఆమెపై కామెంట్లు చేసిన కంగన.. ఈసారి తాప్సీని కాపీ చేసే యాక్ట్రెస్ అంటూ కామెంట్ చేసింది. తన ఫోజ్‌‌ను కాపీ చేసిందంటూ తాప్సీపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసింది. పనిలోపనిగా అమితాబ్ తర్వాత తానే సూపర్ స్టార్ అని స్పష్టం చేసింది. తాప్సీ తనకు నిజమైన ఫ్యాన్ అని తెలిపింది. తనలా మరే ఫిమేల్ సూపర్ స్టార్ కూడా ఇంత క్రేజ్ తెచ్చుకోలేదని, అమితాబ్ తర్వాత సూపర్ స్టార్ తానేనని ట్వీట్ చేసింది.