కర్ణాటక ఎన్నికలు: 93 మంది అభ్యర్థులతో జేడీఎస్ తొలి జాబితా

కర్ణాటక ఎన్నికలు: 93 మంది అభ్యర్థులతో జేడీఎస్ తొలి జాబితా

కర్ణాటకలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నా.. మాజీ సీఎం కుమారస్వామి ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్దమయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తరపున బరిలో దిగబోయే 93 మంది అభ్యర్థుల పేర్లతో మొదటి జాబితాను విడుదల చేశారు. ఈసారి కర్ణాటక ప్రజలు తమకే పట్టం కడతారని కుమారస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరో ఆరు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుండటంతో... ఆ లోగా ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీల నేతలు జోరుగా కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఈసారి అధికారం చేపట్టబోయేది జేడీఎస్సేనని మాజీ సీఎం కుమారస్వామి చెబుతున్నారు.