రేషన్ కార్డుపై యూ టర్న్ తీసుకున్న మంత్రి

రేషన్ కార్డుపై యూ టర్న్ తీసుకున్న మంత్రి

రేషన్ కార్డులకు సంబంధించి కర్ణాటక మంత్రి ఉమేశ్‌ కత్తి యూటర్న్‌ తీసుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కార్డుల కోసం ఎలాంటి కచ్చితమైన పరిమితులు లేవని, కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.

ఢిల్లీ నుండి తనకు వచ్చిన మెసేజ్‌నే తాను మీడియాతో పంచుకున్నాని మంగళవారం తెలిపారు. రేషన్‌కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరిన్ని కొత్త కార్డులు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

టీవీ, ఫ్రిజ్‌, ద్విచక్రవాహనం, ఐదెకరాల భూమి ఉన్న రేషన్‌ కార్డుదారులు తమ కార్డులు వదులుకోవాలని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉమేశ్‌ కత్తి హెచ్చరించడంతో కర్నాటకతో పాటు దేశవ్యాప్తంగా దుమారం రేపింది.దీనిపై కాంగ్రెస్‌, జెడీఎస్‌ నేతలు మండిపడ్డారు. ప్రజలనుండి కూడా వ్యతిరేకత వస్తుందేమోనని భయపడి మంగళవారం మళ్లీ విలేకర్ల సమావేశం నిర్వహించి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. టీవీ, ఫ్రిజ్‌ వంటి నిబంధలనపై తాను గానీ, సీఎం యడియూరప్ప గానీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని వివరణ ఇచ్చారు మంత్రి ఉమేశ్‌ కత్తి.