ఆగని కశ్మీరీ పండిట్ల ఆందోళనలు

ఆగని కశ్మీరీ పండిట్ల ఆందోళనలు

జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శిఖపురలో నివసిస్తున్న కశ్మీరీ పండిట్ ఉద్యోగులను కలిశారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్ మెంట్ ప్యాకేజీ కింద ఉద్యోగాలు పొందినటువంటి కశ్మీరీ పండిట్స్, గత కొన్ని రోజుల క్రితం రాహుల్ బట్ అనే వ్యక్తిని చంపినందుకు నిరసనగా.. ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. కాగా  ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని..  మీ సమస్యలను నిజాయితీగా, న్యాయంగా పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నానని మనోజ్ సిన్హా వారికి  సర్ది చెప్పినా... కశ్మీరీ పండిట్స్ మాత్రం తమను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించేవరకూ, విధుల్లో జాయిన్ అయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 

మే 12న కశ్మీర్ లోని బుద్గాంలో రాహుల్ భట్ అనే అతన్ని లష్కరే తోయిబా టెర్రరిస్టులు కాల్చి చంపిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో రాహుల్ మృతికి నిరసనగా దాదాపు 4000మంది కశ్మీరీ పండిట్ ఉద్యోగులు ఈ ఆందోళనను చేపట్టారు. తమకు సెక్యూరిటీ అందించడంలో యంత్రాంగం విఫలమైందని వారు ఆరోపించారు. కశ్మీర్ లో తమకు రక్షణ ఉన్నట్టు తాము భావించడం లేదన్న వారు... ఈ హత్య తర్వాత ఉన్న ఆ కాస్త నమ్మకం కూడా పోయిందని తెలిపారు.

 

మరిన్ని వార్తల కోసం..

మిత్రుడి ఆనందం కోసం బాలుడి ఆరాటం

ఒకే ఫ్రేమ్‌‌లో పవన్, అఖిరా, రేణుదేశాయ్, ఫాన్స్ ఫుల్ ఖుష్