మిత్రుడి ఆనందం కోసం బాలుడి ఆరాటం

మిత్రుడి ఆనందం కోసం బాలుడి ఆరాటం

పుట్టినపుడు మన కోసం నలుగురు లేరంటే మన తప్పు లేకపోవచ్చు. కానీ చనిపోయేటప్పటికి కనీసం ఒక్కరిని కూడా సంపాదించుకోలేకపోవడం నిజంగా మన తప్పేనని ఓ సినిమాలో చెప్పినట్టు... ప్రతీ ఒక్కరి జీవితంలోనూ మన కోసం పరితపించే, మన గురించి ఆలోచించే ఒక్క వ్యక్తి ఉన్నా వారి జీవితం ధన్యమైనట్టే. అదీ మన గురించి పూర్తిగా తెలిసిన మన ఫ్రెండే అయితే... ఇంకా ఆ ఆనందానికి అవధులుండవు. స్వలాభాన్ని ఆశించి, కపట ప్రేమను చూపించే బంధం ఎప్పటికీ శాశ్వతంగా నిలవదు. స్వార్థం లేని స్నేహం... ఎల్లప్పుడూ త్యాగాన్నే కోరుకుంటుంది. ఈ వ్యాఖ్యలను నిజం చేస్తూ ఓ బాలుడు, వికలాంగుడైన తన స్నేహితుడి కళ్లల్లో ఆనందం చూడడం కోసం ఓ అద్భుతమైన పని చేసి, అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. చేసింది చిన్న పనే అయినా.. చేయాలనే అతని ఆలోచన ... కళ్లు చెమర్చేలా చేస్తోంది.

పాఠశాలలో నిర్వహించిన ఓ పరుగు పందెంలో అందరూ పరుగెత్తుతూ ఎంజాయ్ చేస్తుంటే.. ఓ బాలుడు మాత్రం తన మిత్రుడు కూడా దాన్ని ఎక్సీపిరియన్స్ చేయాలన్న ఉద్దేశంతో వీల్ చైర్ లో ఉన్న అతన్ని తోసుకుంటూ.. అతని ఆనందంలో పాలు పంచుకోవడం వారి మధ్య ఉన్న నిష్కల్మషమైన స్నేహబంధానికి ప్రతీకగా నిలుస్తోంది.. సంతోషంలో ఎవరైనా ఉంటారు.. కానీ బాధలోనూ తోడుగా నిలిచే స్నేహమే గొప్పదని నిరూపిస్తున్న ఆ బాలున్ని అందరూ కీర్తిస్తున్నారు. ఈ వీడియో ఇప్పటికే వేలల్లో లైకులు, మిలియన్ పైగా వ్యూస్ సొంతం చేసుకొని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

మరిన్ని వార్తల కోసం...

ఓయూలో స్టూడెంట్స్ కౌన్సిల్

ఒకే ఫ్రేమ్‌‌లో పవన్, అఖిరా, రేణుదేశాయ్, ఫాన్స్ ఫుల్ ఖుష్