అకీరా గ్రాడ్యుయేషన్ కు కలిసి వచ్చిన పవన్, రేణు

అకీరా గ్రాడ్యుయేషన్ కు కలిసి వచ్చిన పవన్, రేణు

ఒకే ఫ్రేమ్ లో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్, అకీరా, ఆద్యలు కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. రేణు దేశాయ్ కి పవన్ ఎప్పుడో విడాకులు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. అనంతరం వీరు విడివిడిగా ఉంటున్నారు. పిల్లలు అకీరా, ఆద్యలు మాత్రమే రేణు దగ్గరనే ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్.. తాజాగా వీరందరూ కలిసి ఉన్న ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. "నా కొడుకు అప్పుడే పెద్దవాడైపోయాడు.. ఇక సొంత కాళ్లపై నిలబడాలి" అంటూ క్యాప్షన్ పెట్టారు. వీరు కలవడానికి ఓ కారణం ఉంది. అకీరా నందన్ చదువుతున్న ఇంటర్నేషనల్ స్కూల్ లో ఈ మధ్యనే గ్రాడ్యుయేషన్ డే జరిగింది. ఈ కార్యక్రమానికి రేణూ దేశాయ్ తో పాటు పవన్ అటెండ్రే అయ్యారు. ఈ సందర్భంగా వారు కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎన్ని పనులు ఉన్నా.. పిల్లల కోసం పట్టింపులను పక్కకు పెట్టేస్తారని దీనిని బట్టి తెలుస్తోంది. అకీరా నందన్, ఆద్యలను పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు కలుస్తుంటారు. మెగాస్టార్ ఇంట్లో జరిగే ఫంక్షన్ లకు అకీరా, ఆద్యలు హాజరవుతుంటారు. తాజాగా అకీరా చదువుతున్న స్కూల్లో గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పవన్ హైలెట్ గా నిలిచారు. ఆయనతో కలిసి పలువురు ఫొటోలు దిగారు. రేణు దేశాయ్ పోస్టు చేసిన ఫొటోకు నెటిజన్లు స్పందిస్తున్నారు. చదువులో మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. ‘హరిహర వీరమల్లు’ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాల్లో నటిస్తున్నారు.‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ కాగా..‘భవదీయుడు భగత్ సింగ్’ ఆగస్టులో పట్టాలెక్కనుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu (@renuudesai)

మరిన్ని వార్తల కోసం : -

అతడు అర్జునుడేనా?


క్రేజీ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల