యుద్ధ మేఘాల్లో చిక్కుకున్న సినీ తారలు.. నిద్రలేని రాత్రులు గడుపుతున్నామంటూ పోస్ట్‌లు!

యుద్ధ మేఘాల్లో చిక్కుకున్న సినీ తారలు.. నిద్రలేని రాత్రులు గడుపుతున్నామంటూ పోస్ట్‌లు!

పశ్చిమాసియాలో నెలకొన్న  యుద్ధవాతావరణం ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తలెత్తెన వార్ పతాక స్థాయికి చేరింది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేని మృతితో యుద్ధ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అమెరికాకు మద్దతు ఇస్తున్న సౌదీ ఆరేబియా, కువైట్, దుబాయ్, ఖతార్ , బహ్రెయిన్ లపై ఇరాన్ దాడులకు తెగబడింది.  ఈ యుద్ధ వాతావరణంతో విమాన సర్వీసులన్నీ నిలిచిపోయాయి. లక్షలాది మంది విదేశీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు.   షూటింగ్స్ , వ్యక్తిగత పనుల కోసం దుబాయ్ వెళ్ళిన భారతీయ సెలబ్రిటీలు అక్కడే చిక్కుకుపోయి బిగ్గుబిగ్గుమంటున్నారు.

నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. 

బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ ప్రస్తుతం తన భర్త, వ్యాపారవేత్త టోనీ బేగ్‌తో కలిసి దుబాయ్‌లో ఉంటున్నారు. అక్కడ నెలకొన్న అనిశ్చితిపై ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా తన భయాన్ని వ్యక్తపరిచారు. "ఏం జరుగుతుందో తెలియని ఆందోళన నన్ను వెంటాడుతోంది. రాత్రుళ్లు నిద్ర రావడం లేదు, మెదడు ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటోంది. ఈ భయాందోళనల మధ్య గడపడం చాలా కష్టంగా ఉంది" అంటూ ఆమె పోస్ట్ చేశారు.

అబుదాబిలో ఈషా గుప్తా

మరోవైపు నటి ఈషా గుప్తా అబుదాబిలో చిక్కుకున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం పర్యాటకులను కాపాడుతున్న తీరుపై ఆమె ప్రశంసలు కురిపించారు. విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రతి ఒక్కరికీ ఆహారం, వసతి కల్పిస్తూ అబుదాబి ప్రభుత్వం అద్భుతమైన పని చేస్తోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా పౌరులను కాపాడుతున్న విధానం ఆ దేశ శక్తిని చాటుతోంది. త్వరలోనే క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాను అని ఈషా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ప్రధాని మోదీకి సోనాల్ చౌహాన్ విజ్ఞప్తి..

దుబాయ్‌లో ఉన్న సోనాల్ చౌహాన్ కూడా తన క్షేమ సమాచారాన్ని అభిమానులతో పంచుకున్నారు. నేను సురక్షితంగా ఉన్నాను. ఇక్కడి అధికారులు అందరినీ కాపాడటానికి శ్రమిస్తున్నారని అని తెలిపారు .  మరో వైపు  విమానాలు రద్దుకావడంతో భారత్‌కు తిరిగి రావడానికి స్పష్టమైన మార్గం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ విషయమై ఆమె భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి సహాయం కోరారు.

దుబాయ్ లో టాలీవుడ్ హీరో

 యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు దుబాయ్‌లో ఎదురైన భయానక అనుభవాన్ని వెల్లడించారు. ఆకాశంలో క్షిపణులు దూసుకెళ్తున్న దృశ్యాలను వీడియోగా పోస్టు చేసిన ఆయన, క్షిపణుల ప్రభావంతో తాము ఉన్న ఇల్లు కంపించిందని తెలిపారు.  “ఏ చిన్నారి కూడా యుద్ధ వాతావరణంలో పెరగకూడదు. ప్రపంచంలో ఎక్కడైనా పిల్లలకు ప్రశాంతమైన జీవనం ఉండాలి” అంటూ శాంతి కోసం ఆకాంక్షించారు. అలాగే పౌరుల భద్రత కోసం కృషి చేస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రక్షణ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.