మార్చ్ లో బ్యాంకులకు వరుస సెలవులు.. హోలీ, ఉగాది, రంజాన్ సహా హాలిడేస్ ఫుల్ లిస్ట్ ఇదే..

 మార్చ్ లో బ్యాంకులకు వరుస సెలవులు.. హోలీ, ఉగాది, రంజాన్ సహా హాలిడేస్ ఫుల్ లిస్ట్ ఇదే..

 మార్చి నెల మొదలైంది. ఈ నెలలో హోలీ, ఈద్, మహావీర్ జయంతి, శ్రీరామ నవమి వంటి చాల పండుగలు రాబోతున్నాయి. దింతో ఈ నెలలో బ్యాంకులకు చాలా సెలవులు వస్తున్నాయి. శని, ఆదివారాలు సహా ఈ నెలలో బ్యాంకులు మొత్తం 18 రోజులు మూసి ఉంటాయి. అయితే, ఈ సెలవులు  రాష్ట్రాన్ని, నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అందువల్ల కస్టమర్లు  ఏదైనా పై మీద బ్యాంక్ కి వెళ్లే ముందు సెలవుల లిస్ట్  చూడడం మంచిది. 

మార్చి  నెల 1, 8, 15, 22, 29 తేదీల్లో ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసిఉంటాయి. వీటికి తోడు  మార్చి 14 రెండవ శనివారం, మార్చి 28 నాల్గవ శనివారం కాబట్టి ఈ రోజుల్లో  దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ ఉంటాయి. అదేవిధంగా, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో మార్చి 2, 3, 4, 13, 17, 19, 20, 21, 26, 27, 31 తేదీల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. ఈ రోజుల్లో  హోలిక దహన్, హోలీ, ఉగాది, దుల్హండి, నవరాత్రి, ఈద్, శ్రీరామ నవమి, మహావీర్ జయంతి వంటి పండుగలు, పబ్లిక్ హాలిడేస్  సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి.

మార్చి 8, 15, 22, 29 (ఆదివారం)   దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు బంద్
మార్చి 14, 28 రెండవ, నాల్గవ శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మార్చి 3 మంగళవారం హోలిక దహన్ (కోల్‌కతా, ముంబై,జైపూర్,భోపాల్, గువహతి సహా..)
మార్చి  4 బుధవారం హోలీ పండుగ (తెలుగు రాష్ట్రాల్లో సహా)
మార్చి 6, శుక్రవారం  చాప్చర్ కుట్ వేడుకలు( మిజోరాం )
 
మార్చి 17 మంగళవారం షబ్-ఇ-ఖదర్ వేడుకలు (జమ్మూ, శ్రీనగర్ )
మార్చి 19 గురువారం   ఉగాది పండగ (తెలుగు రాష్ట్రాల్లో)
మార్చి 20 శుక్రవారం ఈద్ ఉల్ ఫితుర్(జమ్మూ, కొచ్చి, శ్రీనగర్ )
మార్చి 21 శనివారం రంజాన్ (తెలుగు రాష్ట్రాల్లో సహా)
మార్చి 26 గురువారం శ్రీరామ నవమి (తెలుగు రాష్ట్రాల్లో సహా)
మార్చి 31 మంగళవారం  మహావీర్ జయంతి (తెలుగు రాష్ట్రాల్లో సహా)

 

 

 

 

 

 

 

 

 

ఈ తేదీల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. ఈ రోజుల్లో  హోలిక దహన్, హోలీ, ఉగాది, ఈద్, శ్రీరామ నవమి, మహావీర్ జయంతి వంటి పండుగలు, ఇతర హాలిడేస్  సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి.