నాలుగు రోజుల క్రితం రెండో పెళ్లి... ఇంతలోనే వరుడు ఆత్మహత్య.. 

నాలుగు రోజుల క్రితం రెండో పెళ్లి... ఇంతలోనే వరుడు ఆత్మహత్య.. 

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు రోజుల క్రితం పెళ్ళైన ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండలంలో జరిగింది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బైరెడ్డిపల్లిలో csc సెంటర్ నడుపుతున్న మురళికి నాలుగేళ్ళ క్రితం మొదటి వివాహం అయ్యింది. కొద్దిరోజుల క్రితం మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు మురళి. ఆ తర్వాత నాలుగు రోజుల క్రితం ఇచ్చాపురంకు చెందిన సుజాతతో రెండో వివాహం అయ్యింది.

అయితే, శనివారం ( ఫిబ్రవరి 28 ) ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు మురళి. బయటికి వెళ్లిన మురళి ఇంటికి రాకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబసభ్యులు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మురళి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

ఈ క్రమంలో పెద్ద చెరువు కట్టపై మురళి చెప్పులు విడిచి ఉండటాన్ని గమనించారు అక్కడున్న జాలర్లు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా.. మురళి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మురళి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.