T20 World Cup: సెమీఫైనల్లో భారత్– ఇంగ్లాండ్‌ మధ్య హెడ్ టు హెట్ రికార్డులు ఇవే!

T20 World Cup: సెమీఫైనల్లో భారత్– ఇంగ్లాండ్‌ మధ్య హెడ్ టు హెట్ రికార్డులు ఇవే!

T20 World Cup: ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీమ్స్ పోటీ ఎప్పుడూ కూడా హైటెన్షన్ వాతావరణంలో కొనసాగుతుంది. ముఖ్యంగా ఐసీసీ వంటి టోర్నీల నాకౌట్ మ్యాచ్ లలో ఈ రెండు జట్లు పోటీ పడితే,  క్రికెట్ లవర్స్ కి అసలైన మజా వస్తుంది. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా సెమీ ఫైనల్ కి ఇంగ్లాండ్, టీమిండియా చేరుకున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మార్చి 5వ తేదీన జరిగే రెండో సెమీస్ లో ఈ రెండు టీమ్స్ తలపడనున్నాయి. దీంతో గత రెండు టీ 20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ రికార్డులను పరిశీలిస్తే.. ఇంగ్లీస్– ఇండియా టీమ్స్ మధ్య పోరు ఎంతో ఉత్కంఠంగా కొనసాగింది.

నువ్వా నేనా: 
2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్– -ఇంగ్లాండ్ పోటీ పట్టాయి. ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి.. టీమిండియాను ఓడించి ఫైనల్ కి చేరుకుని.. టైటిల్ ని కూడా ఇంగ్లాండ్ హస్తగతం చేసుకుంది. ఆ ఓటమి భారత క్రికెట్ అభిమానులకు తీవ్రంగా నిరాశ కలిగించినప్పటికీ జట్టుకు పెద్ద గుణపాఠంగా మారిపోయింది. టీ20 వరల్డ్ కప్ 2024 సెమీస్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో భారత్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ పై గెలిచి, గత ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఆ మ్యాచ్ లో టీమిండియా సమిష్టిగా ఆడి ప్రత్యర్థిని చిత్తుగా ఓడించేసింది. ఈ గెలుపుతో ఇండియా– -ఇంగ్లాండ్ సెమీఫైనల్ (11) రికార్డులు సమానంగా ఉన్నాయి.   
 
ఈక్వల్ గా రెండు జట్లు: 
ఇప్పుడు మరోసారి టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2026పైనే క్రికెట్ అభిమానుల నజర్ పడింది. మార్చ్ 5న జరిగే రెండో సెమీస్ లో భారత్ వర్సెస్ -ఇంగ్లాండ్ జట్లు మరోసారి తలపడబోతున్నాయి.  గతంలో ఒక్కోసారి ఒక్కో టీమ్ పైచేయి సాధించగా.. మరీ ఈసారి ఎవరు విజయం సాధిస్తారు అనేదానిపై ఆసక్తి మరింత పెరిగింది. గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. ఇరు టీమ్స్ సమానంగా పోటీ పడుతున్నాయి. కాబట్టి 2026 సెమీఫైనల్ మ్యాచ్ అసలైన మజాను ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్ కోసం భారత్– ఇంగ్లాండ్ జట్లు ముంబై చేరుకుని ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాయి. వాంఖడే మైదానం చిన్నగా ఉంటుంది కాబట్టి పరుగుల వరద పారే ఛాన్స్ ఉంది.  

 

హెడ్-టు-హెడ్ రికార్డులు
* T20 ప్రపంచ కప్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. 
* భారత్ మూడింట్లో విజయం సాధించగా, ఇంగ్లాండ్ రెండు మ్యాచుల్లో గెలిచింది..
* గత T20 ప్రపంచ కప్ నాకౌట్‌లలో  ఈ రెండు జట్లలో గెలిచిన టీమ్ టైటిల్ కొట్టింది..