పోడు పట్టాల పంపిణీకి తేదీని త్వరలోనే ప్రకటిస్తాం : కేసీఆర్

పోడు పట్టాల పంపిణీకి  తేదీని త్వరలోనే  ప్రకటిస్తాం : కేసీఆర్

సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే  అర్హులైన పేదలకు రూ 3 లక్షల ఇస్తామన్న సీఎం.. ఇందుకు సంబంధించి విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపిణీ, పేదలకు ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం వంటి అంశాలపై  ప్రగతి భవన్ లో సీఎం సమీక్ష నిర్వహించారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఆ ప్రకారమే గొర్రెల కొనుగోలు పంపిణీ వ్యవహారాలు సాగాలని  సూచించారు.

వడగండ్ల వానలతో రైతులకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో, ఇటీవల సీఎం పర్యటనలు చేపట్టి రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని సీఎం ఆదేశించారు.

 4 లక్షల ఎకరాలకు సంబంధించి 1 లక్షా 55 వేల మంది అర్హులకు పోడు పట్టాలు అందించేందుకు పాస్ బుక్కులు సిద్ధంగా ఉన్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ క్రమంలో అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ కోసం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు.