కేరళలో వీసీల రాజీనామా ఇష్యూ : హైకోర్టు కీలక ఆదేశాలు

కేరళలో వీసీల రాజీనామా ఇష్యూ : హైకోర్టు కీలక ఆదేశాలు

తొమ్మిది మంది యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆరిఫ్ మొహ్మద్ ఖాన్ జారీచేసిన షోకాజ్ నోటీసులపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గవర్నర్ దీనిపై తుది ఆదేశాలను విడుదల చేసే వరకు వీసీలు పదవుల్లో కొనసాగొచ్చని నిర్దేశించింది. దీంతో గవర్నర్ తాజా ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన 9మంది వీసీలకు ఉపశమనం లభించినట్లయింది.

కేరళలోని ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ వీసీ రిక్రూట్ మెంట్ యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ  ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ నియామకాన్ని రద్దు కూడా చేసింది. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తం 9మంది వీసీలు రాజీనామా చేయాలంటూ గవర్నర్ ట్వీట్ చేయడం కలకలం రేపింది. తన ట్వీట్ లో  9 యూనివర్సిటీల పేర్లను కూడా ఆయన ప్రస్తావించారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఈ పిటిషన్లపై విచారించిన కేరళ హైకోర్టు  పై ఆదేశాలను జారీ చేసింది.