మొదలైన ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర

మొదలైన ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర

ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర  ప్రారంభమైంది. అనుకున్న సమయానికి కంటే గణేశ్ శోభాయాత్ర ఆలస్యంగా ప్రారంభమయ్యింది. 50 అడుగుల ఎత్తులో కొలువుతీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన బడా గణేశుడు.. 9 రోజుల పాటు విశేష పూజలందుకున్నాడు.  చివరి సారిగా ఖైరతాబాద్ మహా గణనాథున్ని చూసేందుకు భక్తులు ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. దీంతో జంట నగరాలు జనసందోహంగా మారాయి. పోలీసులు ఇప్పటికే నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. 

ఇక హైదరాబాద్ లో నేటి నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకొని.. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఇప్పటికే సెపరేట్ రూట్ మ్యాప్ ను కూడా పోలీసులు రిలీజ్ చేశారు. ఇక భక్తుల కోలాహలం మధ్య ఖైరతాబాద్ బడా గణేశ్​ నిమజ్జనం మధ్యాహ్నం 2 గంటలోపే పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.  ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఖైరతాబాద్ గణేశ్ ను తరలించనున్నారు. క్రేన్‌‌ నంబర్‌‌‌‌ 4 వద్ద బడా గణేశ్​ నిమజ్జనం చేస్తారు.