దుబాయ్: బంతి, బంతికి ఉత్కంఠ.. ఓవర్.. ఓవర్‌కు రిజల్ట్‌లో తేడాలు.. ఏ బ్యాట్స్‌మన్ ఎలా ఆడతాడోనని ఊపిరి బిగపట్టి చూసిన క్షణాల్లో.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దుమ్మురేపింది. టీ20 ఫార్మాట్ హిస్టరీలోనే తొలిసారి రెండు సూపర్ ఓవర్లు ఆడిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. ఫలితంగా ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బలమైన ముంబైకి చెక్ పెట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 176/6 స్కోరు చేసింది. డికాక్ (43 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 53) టాప్ స్కోరర్. టార్గెట్ ఛేజింగ్‌లో పంజాబ్ 20 ఓవర్లలో 176/6 స్కోరే చేసింది. రాహుల్ (51 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 77) ఒంటరిపోరాటం చేశాడు. అయితే స్కోర్లు సమం కావడంతో ఫస్ట్ సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. ఇందులో పంజాబ్ 5 రన్స్ చేయగా, ముంబై కూడా అదే స్కోరుకు పరిమితమైంది. ఫలితాన్ని తేల్చేందుకు రెండో సూపర్ ఓవర్‌ను వేయించగా, ముంబై 11 రన్స్ చేస్తే, పంజాబ్ 15 రన్స్ చేసి గెలిచింది.
డికాక్ సూపర్
స్టార్టింగ్‌లో లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడిన పంజాబ్ బౌలర్లు వరుస విరామాల్లో మూడు వికెట్లు తీసి మ్యాచ్‌పై పట్టు బిగించారు. కానీ ఓ ఎండ్‌లో డికాక్ ఒంటరిగా పోరాటం చేసి ఇన్నింగ్స్‌ను గట్టెక్కించాడు. ఫస్ట్ ఓవర్‌లో ఫోర్‌తో టచ్‌లోకి వచ్చిన రోహిత్ (9) మూడో ఓవర్‌లో ఔట్‌కాగా, నాలుగు బాల్స్ తేడాలో సూర్యకుమార్ (0) కూడా పెవిలియన్ చేరారు. ఇషాన్ కిషన్ (7) ఎక్కువసేపు వికెట్ కాపాడుకోలేకపోయాడు. పవర్‌ప్లేలో ముంబై 43/3 స్కోరు చేసింది. డికాక్‌తో జతకలిసిన క్రునాల్ పాండ్యా (34) సమయోచితంగా ఆడాడు. దీంతో తొలి 10 ఓవర్లలో ముంబై 70/3 స్కోరుకు చేరింది. 11వ ఓవర్‌లో స్క్వేర్ లెగ్‌లో సూపర్ సిక్సర్ కొట్టిన డికాక్ జోరు పెంచే ప్రయత్నం చేశాడు. ఆ వెంటనే క్రునాల్ కూడా రెండు ఫోర్లు కొట్టినా.. 14వ ఓవర్‌లో రవికి వికెట్ ఇచ్చుకున్నాడు. హార్దిక్ (8) ఎదుర్కొన్న ఫస్ట్ బాల్‌నే సిక్సర్‌గా మలిచాడు. తర్వాతి ఓవర్‌లో డికాక్ 4, 6 బాదడంతో ముంబై స్కోరు 15 ఓవర్లలో 114/4కు చేరింది. సెకండ్ స్పెల్‌కు వచ్చిన షమీ.. 16వ ఓవర్‌లో హార్దిక్‌ను ఔట్ చేయడంతో ఐదో వికెట్‌కు 20 రన్స్ భాగస్వామ్యం ముగించాడు. తర్వాతి ఓవర్‌లోనే డికాక్ కూడా పెవిలియన్‌కు చేరాడు. ఇక లాస్ట్‌లో పొలార్డ్ (34 నాటౌట్) సిక్స్‌లు కొడితే, కూల్టర్‌నైల్ (24 నాటౌట్) ఫోర్లతో రెచ్చిపోయారు.
దుమ్మురేపిన రాహుల్
టార్గెట్ ఛేజింగ్‌లో పంజాబ్‌కు మెరుగైన ఆరంభం దక్కలేదు. మూడో ఓవర్‌లో రాహుల్ 4, 4, 6, 4తో 20 రన్స్ పిండుకున్నా.. నాలుగో ఓవర్‌లోనే మయాంక్ (11) ఔటయ్యాడు. గేల్ (24) సిక్సర్‌తో దూకుడు మొదలుపెట్టినా, ఆరో ఓవర్‌లో రాహుల్ 6, 4తో పంజాబ్‌ను 51/1 స్కోరుతో నిలిపాడు. ఏడో ఓవర్‌లో రెండో సిక్సర్ కొట్టిన గేల్… మరో ఫోర్ బాది 10వ ఓవర్‌లో ఔటయ్యాడు. ఇదే ఓవర్‌లో పూరన్ (24) సిక్స్, ఫోర్ కొట్టడంతో స్కోరు 87/2కు పెరిగింది. తర్వాతి ఓవర్‌లో పూరన్ సేమ్ సీన్ రిపీట్ చేసినా, 13వ ఓవర్‌లో వికెట్ ఇచ్చుకున్నాడు. కొద్దిసేపటికే మ్యాక్స్‌వెల్ (0) డకౌట్ కావడంతో పంజాబ్ 115/4తో కష్టాల్లో పడింది. దీపక్ హుడా (23 నాటౌట్) కూడా బ్యాట్ ఝుళిపించడంతో విక్టరీ టార్గెట్ 24 బాల్స్‌లో 37 రన్స్‌గా మారింది. ఈ దశలో కూల్టర్‌నైల్ 10 రన్స్ ఇచ్చినా.. బుమ్రా యార్కర్‌కు రాహుల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. హుడాతో జతకలిసిన జోర్డాన్ (13) నిలకడగా ఆడాడు. ఈ ఓవర్‌లో 4 రన్సే రావడంతో విజయసమీకరణం 12 బాల్స్‌లో 23 రన్స్‌గా మారింది. 19వ ఓవర్‌లో కూల్టర్‌నైల్ 4, 4తో 13 రన్స్ ఇవ్వడంతో.. లాస్ట్ ఓవర్‌లో 9 రన్స్ అవసరమయ్యాయి. కానీ 8 రన్సే రావడంతో సూపర్ ఓవర్‌కు దారితీసింది.
When you see it! ?#SaddaPunjab #IPL2020 #KXIP #MIvKXIP #UniverseBoss pic.twitter.com/8UFSuCY51C
— Kings XI Punjab (@lionsdenkxip) October 19, 2020

