పెరూలో ఘోర విమాన ప్రమాదం.. 13 మంది టూరిస్టులు మృతి

పెరూలో ఘోర విమాన ప్రమాదం.. 13 మంది టూరిస్టులు మృతి

న్యూఢిల్లీ: పెరూలో ఘోర విమాన ప్రమాద జరిగింది. నాజ్కా నగర సమీపంలో పర్యాటకులతో వెళ్తున్న విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 13 మంది మరణించినట్లు ఆ దేశ రవాణా, సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది.పెరూలోని ప్రసిద్ధ నాజ్కా లైన్స్‌ను సందర్శించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో 11 మంది విదేశీ పర్యాటకులు ఇద్దరు సిబ్బంది ప్రయాణిస్తున్నారని.. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్స్ ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. 

ప్రమాదానికి గురైన విమానాన్ని సెస్నా కారవాన్ C-208 ఫ్లైట్‎గా అధికారులు గుర్తించారు. ప్రత్యేక పర్యాటక విమానాలను నడిపే ఏరోడియానా అనే ఎయిర్ లైన్స్ కంపెనీ ఈ విమానాన్ని నడుపుతున్నట్లు పెరూ రవాణా, సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటలీ, జర్మన్, స్పానిష్‏కు చెందిన 11 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో నాజ్కా లైన్స్ విహారయాత్ర యాత్ర కోసం శనివారం (ఆగస్ట్ 1) మధ్యాహ్నం 12:10 గంటలకు పిస్కో విమానాశ్రయం నుంచి ఫ్లైట్ బయలుదేరింది.

టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ప్యూబ్లో నుయెవో జిల్లాలోని సోకోస్ సమీపంలో ఏటీసీతో విమానం సంబంధాలు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే నాజ్కా నగర సమీపంలో ఫ్లైట్ క్రాష్ అయ్యింది.  ప్రమాదానికి గల కారణాన్ని నిర్ధారించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఏవియేషన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ కమిషన్ దర్యాప్తు ప్రారంభిందని అధికారులు తెలిపారు.