KKR vs GT : రెచ్చిపోయిన గుర్జాజ్.. గుజరాత్ ఈజీ టార్గెట్

KKR vs GT : రెచ్చిపోయిన గుర్జాజ్.. గుజరాత్ ఈజీ టార్గెట్

ఈడెన్ గార్డెన్స్ లో గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో రషిద్ ఖాన్ మినహా మిగిలిన గుజరాత్ బౌలర్లందరూ సూపర్ బౌలింగ్ చేశారు. 

కోల్ కతాకు మంచి ప్రారంభం లభించింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ నుంచే దాటిగా ఆడారు ఓపెనర్లు జగదీశన్ (19, 15 బంతుల్లో), గుర్బాజ్ (81, 39 బంతుల్లో). జగదీశన్ తక్కువ స్కోర్ కే ఔట్ అయినా.. ఆ జోరును గుర్బాజ్ కొనసాగించాడు. సిక్సర్లు, ఫోర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 

అయితే, తర్వాత వచ్చిన ఏ బ్యాట్స్ మెన్ క్రీజ్ లో నిలకడ ప్రదర్శిచేలేదు. శార్దూల్ ఠాకూర్ (0, 4 బంతుల్లో), వెంకటేష్ అయ్యర్ (11, 14  బంతుల్లో), కెప్టెన్ నితిష్ రాణా (4, 3  బంతుల్లో) నిరాశ పరిచారు.

చివర్లో రస్సెల్ (34, 19  బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో కోల్ కతా 179 పరుగుల మైలు రాయిని దాటింది. గుజరాత్ బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టాడు. లిటిల్, నూర్ అహ్మద్ కు చెరో రెండు వికెట్లు దక్కాయి.