అన్ని జిల్లాల్లో న్యాయసేవా కేంద్రాలు

అన్ని జిల్లాల్లో న్యాయసేవా కేంద్రాలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో లీగల్‌ ఎయిడ్‌  డిఫెన్స్‌  కౌన్సెల్‌  సిస్టమ్‌  (ఎల్‌ఏడీసీఎస్‌) కేంద్రాలు ఏర్పాటయ్యాయి. రెండో విడతలో 17 జిల్లాల్లో ఎల్ఏడీసీఎస్  కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్, స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ప్యాట్రన్‌ ఇన్‌ చీఫ్‌  జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ పి. నవీన్‌రావు వర్చువల్‌ విధానంలో శుక్రవారం హైకోర్టు నుంచి ఎల్ఏడీసీఎస్  కేంద్రాలను ప్రారంభించారు.

జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, కుమ్రం భీం అసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్‌, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ లీగల్‌  సర్వీసెస్‌ అథారిటీ, ములుగు, నారాయణపేట, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో ఈ కేంద్రాలను ప్రారంభించారు. ఫిబ్రవరి 3న తొలి దశలో 16 జిల్లాల్లో వాటిని  ఏర్పాటు చేశారు.