V6 News

తెలంగాణ వారసత్వాన్ని కాపాడుకుందాం : వాణి ప్రసాద్

తెలంగాణ వారసత్వాన్ని కాపాడుకుందాం : వాణి ప్రసాద్
  • రాష్ట్ర టూరిజం స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ వాణి ప్రసాద్

బషీర్​బాగ్​, వెలుగు: తెలంగాణ వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ అన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌‌‌‌‌‌‌‌లోని స్టేట్ మ్యూజియంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డితో కలిసి మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వం వారసత్వ పరిరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. విద్యార్థులు, యువత తమ ప్రాంతాల్లో ఉన్న పురాతన కట్టడాలు, వాటి ప్రత్యేకతలపై డాక్యుమెంటరీలు రూపొందించాలని కోరారు. మరుగునపడిన వారసత్వ సంపదను వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వారసత్వ శాఖ డైరెక్టర్ అర్జున్ రావు, ఇంటాక్ జాతీయ కార్యవర్గ సభ్యుడు వేదకుమార్, ప్రముఖ కవి యాకుబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.