V6 News

గవర్నర్తో సీఎం రేవంత్ కీలక భేటీ.. కోదండరాం, అజారుద్దీన్ల అంశంలో గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ

గవర్నర్తో సీఎం రేవంత్ కీలక భేటీ.. కోదండరాం, అజారుద్దీన్ల అంశంలో గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లోక్ భవన్కు చేరుకున్నారు. గవర్నర్ను కలిసి ఎమ్మెల్సీ అజారుద్దీన్ అంశంపై చర్చించనున్నారు. మహిళా బిల్లు, డి లిమిటేషన్ అంశంపై కూడా గవర్నర్తో సీఎం చర్చిస్తారు. ఎమ్మెల్సీలు కోదండరామ్, అజారుద్దీన్ అంశంపై గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సుదీర్ఘంగా చర్చించడానికి సీఎం లోక్ భవన్ కు వెళ్లారు. 

ఏప్రిల్ 30వ తేదీతో అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఎన్నికై ఆరు నెలలు పూర్తి అవుతుండటం గమనార్హం. ఏ సభలో సభ్యుడు కానప్పటికీ అజారుద్దీన్ MLCగా కొనసాగుతున్నారు. MLCగా కొనసాగడానికి అజారుద్దీన్కి ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో గవర్నర్తో సీఎం భేటీ కీలకంగా మారింది. గవర్నర్ కోటా MLCలుగా ఎమ్మెల్సీలు కోదండరాం, అజారుద్దీన్లను ఆమోదించాలని గవర్నర్కు సీఎం విజ్ఞప్తి చేయనున్నారు. అజారుద్దీన్ విషయంలో గవర్నర్ ఎలా స్పందిస్తారనే అంశంఫై ఉత్కంఠ నెలకొంది.