పాల్వంచ, వెలుగు: పాల్వంచ మండలంలోని సత్యనారాయణపురం గ్రామ సర్పంచ్ జర్పుల సంధ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పంచాయతీ పాలనా వ్యవహారాల్లో సర్పంచ్ భర్త జోక్యం చేసుకుంటున్నారని వార్డు సభ్యులు తరచూ సెక్రటరీకి ఫిర్యాదులు చేయడంతో.. పాలనలో భర్త జోక్యం ఉండకూడదని సెక్రటరీ బాబు సర్పంచ్‌కు సూచించినట్లు తెలిసింది.
ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, సంధ్య ఆదివారం ఇంట్లో ట్యాబ్లెట్లు మింగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆమెను పాల్వంచ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ట్రీట్మెంట్ అందించిన డాక్టర్లు సంధ్య ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
