V6 News

OTTలోకి మలయాళ సూపర్ హిట్ మూవీ: 6 కోట్ల బడ్జెట్..72 కోట్ల వసూళ్లు.. తెలుగులో స్ట్రీమింగ్

OTTలోకి మలయాళ సూపర్ హిట్ మూవీ: 6 కోట్ల బడ్జెట్..72 కోట్ల వసూళ్లు.. తెలుగులో స్ట్రీమింగ్

తమిళ యంగ్ యాక్టర్ కెన్ కరునాస్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేసిన మూవీ ‘యూత్‌‌’ (Youth)‌. మార్చి 26, 2026న తెలుగులో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ సాధించింది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 72 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సత్తా చాటింది. ఇపుడు ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ ఏప్రిల్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతూ ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తోంది. 

కాలేజ్ లైఫ్‌‌ను ఎంజాయ్ చేయాలనుకునే యూత్‌‌, మిడిల్‌‌ క్లాస్‌‌ పేరెంట్స్‌‌ వాళ్లపై పెట్టుకున్న నమ్మకాల నేపథ్యంలో మూవీ తెరకెక్కింది. హై స్కూల్ విద్యార్థి ప్రవీణ్ (కెన్ కరుణాస్) జీవితాన్ని ఆధారంగా తీసుకుని ఫన్ + ఎమోషన్ ఎలిమెంట్స్ తో కథను అల్లుకున్న విధానం ప్రేక్షకుల్ని ఫిదా చేసింది.

ప్రవీణ్ తన తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చేందుకు చదువులో మెరుగుపడాలని ప్రయత్నిస్తూ, ప్రేమ మరియు యౌవన దశలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే అంశాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. సినిమా చూసిన తమిళ & తెలుగు ప్రేక్షకులు డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించారు.

కేవలం 23 ఏళ్ల వయసులోనే హీరోగా, దర్శకుడిగా మెప్పించడం అంటే మాములు విషయం కాదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. మరి ముఖ్యంగా ఈ చిత్రాన్ని 53 రోజుల్లో పూర్తి చేసి హిట్ కొట్టడం అంటే, కెన్ కరుణాస్ మేకింగ్ స్టైల్కి నిదర్శనంగా నిలిచింది.

‘యూత్‌‌’ కథ:

మధ్యతరగతి కుర్రాడు ప్రవీణ్‌ (Ken Karunas) అల్లరి కుర్రాడు. అతనివైపు స్కూల్ లో ఏ అమ్మాయి కన్నెత్తి చూడదు. అయినప్పటికీ స్కూల్‌ లైఫ్‌ పూర్తయ్యేలోపే ఒక అమ్మాయిని ప్రేమించాలని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలోనే గంగవల్లి, ప్రేషిక, సోనాల్‌ అనే అమ్మాయిలు తన లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తారు.

వారి రాక అతని జీవితాన్ని మలుపుతిప్పుతాయి. లవ్, బ్రేకప్‌లు, అవమానాలు అన్నీ ఎదుర్కొంటాడు. వీటి మధ్య ప్రవీణ్ లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ ప్రయాణంలో తల్లిదండ్రుల కలల్ని నెరవేర్చాడా? లేదా? అన్నదే మిగతా కథ.