బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా (BECIL) మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, పెర్ఫ్యూషనిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్ పేరు: మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, పెర్ఫ్యూషనిస్ట్.
మొత్తం ఖాళీలు: 28.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, పెర్ఫ్యూషనిస్ట్ లో బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి. కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 13.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.295.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 27.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ www.becil.comను సందర్శించండి.

