భద్రాచలం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ శివారులో విజయవాడ–-జగదల్పూర్ హైవేపై అనుమానాస్పదంగా నిలిపి ఉన్న కారులో బుధవారం 33.6 కిలోల ఎండు గంజాయిని ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై చావా శ్రీహరి ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణ శివారులో ఇసుక ర్యాంప్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఒక కారు అనుమానాస్పదంగా నిలిపి ఉంది.
కారును తనిఖీ చేయగా అందులో గంజాయి లభ్యమైంది. స్మగ్లర్ల కోసం పరిసర ప్రాంతాల్లో వెతికినా ఎవరూ కనిపించలేదు. గంజాయితో పాటు కారును అబ్కారీ స్టేషన్కు తరలించారు.

