V6 News

నిర్మల్ మామడ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి గుడిలో చోరీ : బంగారం, వెండి ఎత్తుకెళ్లిన దొంగలు

నిర్మల్ మామడ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి గుడిలో చోరీ : బంగారం, వెండి ఎత్తుకెళ్లిన దొంగలు

దొంగలు బాబోయ్ దొంగలు.. గుళ్లు, గోపురాలను వదలటం లేదు. నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్థరాత్రి దోపిడీకి తెగబడ్డారు దొంగలు. 2026, ఏప్రిల్ 15వ తేదీ అర్థరాత్రి.. గుర్తు తెలియని కొంత మంది వ్యక్తులు.. ఆలయంలోకి వచ్చారు. సీసీ కెమెరాలు పగలగొట్టారు. 

లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో.. స్వామి వారి ఆభరాలను ఎత్తుకెళ్లారు. 13 గ్రాముల బంగారం, 5 కిలోల వెండి ఆభరణాలను పోయినట్లు స్పష్టం చేశారు ఆలయ పూజారులు, నిర్వహకులు. సీసీ కెమెరాలను ధ్వంసం చేయటం వల్ల ఎవరు అనేది గుర్తించటం కష్టంగా మారిందన్నారు పోలీసులు. ఆలయం సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించి.. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని వెల్లడించారు పోలీసులు. 

దొంగతనం జరిగిన మామడ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పరిశీలించారు పోలీసులు. కేసు నమోదు చసి విచారణ చేస్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని వెల్లడించారు పోలీసులు.