సార్ గ్రూప్ కు చెందిన లివ్ ఫాస్ట్, తమ ఇన్వర్టర్ బ్యా టరీలను తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది . ఇప్పటికే యుపి,పంజాబ్, హర్యానాలలో తమ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పుడు దక్షిణ భారతదేశం పై ఎక్కువగా దృష్టి సారిం చనున్నట్లు కంపెనీ తెలిపింది . ఇన్వర్టర్ ను సరికొత్తగా డిజైన్ చేయడంతో పాటు ఏఐ టెక్నాలజీతో 25% త్వరిత చార్జిం గ్, అదనపు బ్యాకప్ వంటి సదుపాయాలతో ఈ సరికొత్త ఇన్వర్టర్ బ్యాటరీలను రూపొందించినట్లు లివ్ ఫాస్ట్ సీఈవో గుర్ ప్రీత్ సింగ్ భాటియా తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలోనే 5 వేల యూనిట్ల అమ్మకాలు జరపడం తమ లక్ష్యమని అన్నారు. ఇన్వర్టర్ బ్యాటరీల్లో 18 మోడల్స్ ఉన్నాయని, వీటికి 4–6 సంవత్సరాల వారంటీ అందిస్తున్నట్లు చెప్పారు. ఇన్వర్టర్ బ్యాటరీ మార్కెట్లో తెలంగాణ, ఏపీల వాటా రూ.750 కోట్లు ఉంటుందని తెలిపారు. 22 డిస్ట్రిబ్యూటర్లు, 3 వేల డీలర్ల తో తెలుగు రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఇండియాలో 50 శాతం అనార్గనైజ్డ్ బ్యాటరీ మార్కెట్ కాగా, మొత్తం బ్యాటరీల మార్కెట్ రూ.25 వేల కోట్లని, దీన్లోరూ.15 వేల కోట్ల మేర ఇన్వర్టర్ బ్యాటరీల మార్కెట్ ఉంటుందన్నారు. గతేడాది మార్చి నాటికి కంపెనీ రూ.వెయ్యి కోట్ల టర్నోవర్ సాధించగా, 2019 మార్చి నాటికి రూ.2 వేల కోట్ల టర్నోవర్ సాధిస్తామని గుర్ ప్రీత్ సింగ్ చెప్పారు.
