కోట విద్యార్థిని పేరెంట్స్‌తో ఫోన్‌లో మాట్లాడిన విదేశాంగ మంత్రి

కోట విద్యార్థిని పేరెంట్స్‌తో ఫోన్‌లో మాట్లాడిన విదేశాంగ మంత్రి

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్థులను ఆపరేషన్ గంగ పేరుతో కేంద్ర ప్రభుత్వం సేఫ్ గా స్వస్థలాలకు చేరుస్తోంది. ఇప్పటి వరకు 6 వేల మందికి  పైగా క్షేమంగా వారి తల్లిదండ్రుల చెంతకు చేరారు. ఇలా స్వదేశానికి చేరిన కొంత మంది విద్యార్థుల ఇండ్లకు వెళ్లిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.. వారిపేరెంట్స్ ను పరామర్శించారు. అలాగే ఇంకా ఉక్రెయిన్ నుంచి రావాల్సిన వారి విషయంలోనూ భయం వద్దని పేరెంట్స్ కు చెప్పారు. ప్రతి ఇండియన్ పౌరుడిని క్షేమంగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా కృషి చేస్తోందని అన్నారు.  రాజస్థాన్ లోని తన సొంత నియోజకవర్గమైన కోటలో ఇద్దరు విద్యార్థుల ఇండ్లకు ఓం బిర్లా వెళ్లారు.

ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కు స్పీకర్ ఓం బిర్లా ఫోన్ కలిపి.. ఓ విద్యార్థిని పేరెంట్స్ తో మాట్లాడించారు. తమ కుమార్తెను సేఫ్ గా భారత్ కు తీసుకొచ్చినందుకు ఆ విద్యార్థిని పేరెంట్స్ థ్యాంక్స్ చెప్పారు. పోలాండ్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ సీ17లో తమ బిడ్డ ఇవాళ ఢిల్లీ చేరుకుందని, కేంద్ర ప్రభుత్వానికి తాము రుణపడి ఉంటామని అన్నారు. ప్రభుత్వం ఎంతో శ్రమించి ఉక్రెయిన్ లో చిక్కుకున్న బిడ్డలను స్వదేశానికి తీసుకొస్తోందని, ఎంత త్వరగా వాళ్లను ఇండియాకు చేరిస్తే.. ఆందోళన చెందుతున్న పేరెంట్స్ కుదుటపడుతారని అన్నారు.

ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మన విద్యార్థులను సేఫ్‌గా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ పేరుతో చర్యలు తీసుకుంటోంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారు సరిహద్దు ప్రాంతానికి చేరుకుంటే.. అక్కడి నుంచి హంగేరి, పోలాండ్, రొమేనియా, స్లొవేకియా వంటి పొరుగు దేశాల్లోని ఎయిర్ పోర్టుల నుంచి స్పెషల్ ఫ్లైట్స్‌లో ఇండియాకు చేరుస్తోంది. ఈ క్రమంలో యుద్ధ బీభత్సం మధ్య భారతీయులకు ఎటువంటి హాని చేయకుండా ఉండేలా ప్రధాని మోడీ.. ఉక్రెయిన్, రష్యా దేశాల అధ్యక్షులతో చర్చలు జరిపారు. ఈ మేరకు  భారత విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సులకు భారత దేశ జెండాను పెట్టుకొని వెళ్తే హాని చేయబోమని రెండు వైపుల నుంచి హామీ ఇచ్చింది. దీంతో మన విద్యార్థులు ఉక్రెయిన్‌లోని సిటీల నుంచి జాతీయ జెండాలతో సరిహద్దు వరకూ చేరుకోవాల్సిందిగా భారత ప్రభుత్వం సూచించింది. వీరిని పొరుగు దేశాల ద్వారా మరింత వేగంగా ఇండియాకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ ఫ్లైట్స్ తో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అతి పెద్ద ట్రాన్స్ పోర్ట్ విమానం సీ17ను కూడా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించింది.

మరిన్ని వార్తల కోసం...

ఏపీ ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్​

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్

ఆపరేషన్ గంగ: ఢిల్లీ చేరుకున్న నాలుగు ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్